ముమ్మిడివరం నియోజకవర్గ లో ఆలయాల నిర్మాణానికి 5 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు మంజూరు: స్థానిక శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు.ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం పునరుద్దరణకు 4 కోట్ల రూపాయలు ,ముమ్మిడివరం మండలం తానెలంక గ్రామ౦లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు 1 కోటి రూపాయలు అలాగే తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో ఉన్న శ్రీ పరదేశమ్మ వారి దేవస్థానకు 60 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినవని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) తెలియజేసారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లకు ధన్యవాదాలు తెలియజేసారు.ఆయ గ్రామాల ప్రజలు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేసారు.