Donations

మన గ్రామంలో పరదేశమ్మ అమ్మవారి ఆలయం త్వరలో పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని తెలియచెయ్యడానికి ఆనంద పడుతున్నాము.

ఇంజరం మరియు పరిసర గ్రామాలలో ఏవిధమైన కష్టం వచ్చినా పరదేశమ్మ తల్లీ అని మొక్కుకునే వారు చాలా మంది మనలో వున్నారు.

శ్రీ పరదేశమ్మ ఆలయ పునర్నిర్మాణం లో మనమూ భాగస్వాములం కావడం మన పూర్వజన్మ ఫలం. ఎందుకంటే గుడి నిర్మాణం ఒక తరంలో మాత్రమే జరుగుతుంది, అటువంటి అదృష్టం మన తరానికి కలిగినందుకు ధన్యులం, ఆ తల్లి ఆశీస్సులు మనతో పాటు మన భావితారాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీవంతు ఆర్థిక సహాయాన్ని అందించి అమ్మవారి కృప పొందాలని కోరుచున్నాము.
ఇట్లు
శ్రీ పరదేశమ్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ, ఇంజరం