శ్రీరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
శ్రీ పరదేశమ్మ ఆలయ చరిత్ర ఇంజరం గ్రామ పంచాయతీ ఏరియాలో సుమారు 100సంవత్సరాల క్రితం శ్రీ పరదేశమ్మ అమ్మవారి దేవాలయమును శ్రీ నండికోళ్ల వారి వంశీయులు నిర్మించి యున్నారు. వారి బంధువులు కాళ్ళ వారి వంశీయులు య.1.97 సెంట్లు భూమిని అమ్మవారి ధూపదీప నైవేద్యములు చేయుటకు విరాళంగా ఇచ్చియున్నారు. తదుపరి గుడి శిథిలమైనందున 1983 సం.లో శ్రీ నృసింహదేవర సత్యనారాయణ మూర్తి(దత్తుడు) గారు పునర్మించి యున్నారు. ప్రస్తుతం దేవాలయం శిథిలావస్థకు చేరి యున్నందున కొత్తగా నిర్మించుటకు గ్రామంలో అందరూ అంగీకారం తెలుపవలసిందిగా కోరుచున్నాము