ముమ్మిడివరం నియోజకవర్గ లో ఆలయాల నిర్మాణానికి 5 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు మంజూరు: స్థానిక శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు.ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం పునరుద్దరణకు 4 కోట్ల రూపాయలు ,ముమ్మిడివరం మండలం తానెలంక గ్రామ౦లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు 1 కోటి రూపాయలు అలాగే తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో ఉన్న శ్రీ పరదేశమ్మ వారి దేవస్థానకు 60 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినవని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) తెలియజేసారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లకు ధన్యవాదాలు తెలియజేసారు.ఆయ గ్రామాల ప్రజలు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేసారు.
తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామంలో సుమారు 60 లక్షల నిధులతో శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా స్థానిక కె.వి.ఆర్ అంజలీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకరపర్తి వెంకట్రావు, పూర్ణిమా దంపతులు పీటలపై కూర్చొని అమ్మవారికి పూజలు నిర్వహించి శాస్త్ర యుక్తంగా భూమి పూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాగీ బాబ్జి రాజు, వేగేశ్న భాస్కర్ రాజు, ఆకెళ్ళ నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపిటిసి కోరుకొండ కిరణ్ కుమారీ చంటి, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పరదేశమ్మ తల్లి ఆశీస్సులుతో పునర్నిర్మాణానికి సంబంధించి గుడి తొలగించే పని మొదలు కావడం జరిగింది.
తల్లి ఆశీస్సులు మరియు గ్రామస్తుల అనుమతితో శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి గుడి తొలగించే పని, శంకుస్థాపన మరియు ప్రతిష్ట మా దంపతులకు అవకాశం కలగడం ఆనందదాయకం.
రేపు అంటే 29.03.2026 ఉదయం 10గం లకు మన పరదేశమ్మ అమ్మవారి గుడి అందుచేత మీరు,ఇంకా ఎవరైనా ఉంటే అందరూ కూడా ఆ సమయానికి అక్కడకు రావలసినది గా కోరుచున్నాము. చర్చించి వలసిన విషయం.
01. పాత ఆలయం విషయం
02. బాల ఆలయం
03. విగ్రహం మార్చవలసిన ప్రదేశం
04. కళాపకర్షణ
05. శంఖుస్థాపన
మిగిలిన వారికి కూడా తెలియచేయండి.